కాలువ డిజైన్‌ మార్చండి

ABN , First Publish Date - 2022-12-15T23:55:24+05:30 IST

పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా రైతుల శ్రేయస్సు కోరి పాలకులు డిజైన్‌ మార్చాలని, లేకుంటే కాలువ నిర్మాణంలో భూములు కోల్పో తున్న భూమికి బదులు భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు.

కాలువ డిజైన్‌ మార్చండి

వేపాడ: పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా రైతుల శ్రేయస్సు కోరి పాలకులు డిజైన్‌ మార్చాలని, లేకుంటే కాలువ నిర్మాణంలో భూములు కోల్పో తున్న భూమికి బదులు భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. మండలం లోని గుడివాడ, దబ్బిరాజుపేట గ్రామాల్లో భూ సేకరణకు గాను ప్రత్యేక కలెక్టర్‌ బి.సుద ర్శన్‌దొర సారధ్యంలో బుధవారం గ్రామసభలను నిర్వహించారు. ఈ సభల్లో పాల్గొ న్న రైతులు ఏడువాక అప్పలనాయుడు, సన్యాసిరావు, రైతు నాయకు లు చల్లా జగన్‌ తదితరులు మాట్లాడుతూ కాలువ నిర్మాణంలో భాగంగా భూము లు కోల్పో తున్న రైతులు కూలీలుగా మిగలడం తప్ప వేరే ఆధారం లేదని దీనిని అధికారులు గుర్తించి కాలవ నిర్మాణానికి వేసిన డిజైన్‌ మార్చాలని డిమాండ్‌ చేశా రు. లేకుంటే భూములు కోల్పోతున్న రైతులకు ఎంతభూమి తీసుకుంటే అంత భూ మిని అప్పగించాలని కోరారు. కాలువ నిర్మాణ డిజైన్‌ మార్పు చేస్తే వేపాడ మం డలంలోని రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. లేకుంటే రైతులకు అన్యాయం చేయాలని అనుకుంటే ప్రాణాలైనా అర్పిస్తామే కానీ భూములు మాత్రం వదిలేది లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రోజెక్టు ఈఈలు, తహసీల్దార్‌ కృష్ణంరాజు, ఆర్‌ఐ రామలక్ష్మి, గుడివాడ ఆకులసీతంపేట దబ్బిరాజుపేట గ్రామ సర్పంచ్‌ లు మిడతాన గోపి, సుంకరిరమణమ్మ, దండుపాటిసత్తిబాబు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:55:25+05:30 IST