నేటి నుంచి దుర్గమ్మ ఆలయంలో చండీ హోమం
ABN , First Publish Date - 2022-12-15T00:00:53+05:30 IST
మండలంలోని దేవాడ-ముసిరాం గ్రామాల మధ్య మామిడితోటలో వెలసిన తోట దుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి చండీహోమం నిర్వహిస్తున్నట్టు ఆలయం నిర్వాహకులు తెలిపారు.
కొత్తవలస: మండలంలోని దేవాడ-ముసిరాం గ్రామాల మధ్య మామిడితోటలో వెలసిన తోట దుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి చండీహోమం నిర్వహిస్తున్నట్టు ఆలయం నిర్వాహకులు తెలిపారు. ఈ హోమం గురువారం నుంచి 19 వరకు జరుగుతుదన్నారు. 108 పుట్టల నుంచి మట్టిని తీసుకొచ్చి హోమ గుండం ఏర్పాటు చేశామని, 108 కేజీల పసుపుకొమ్ములు, 108 కేజీల కుంకుమతో వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు.