రోడ్లపై దృష్టి సారించలేరా?

ABN , First Publish Date - 2022-10-18T04:36:38+05:30 IST

కనీసం రోడ్లు బాగు చేయలేని ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందో అర్థం కావడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంఽఽధ్యారాణి అన్నారు.

రోడ్లపై దృష్టి సారించలేరా?
రోడ్లుపై వరినాట్లు వేస్తున్న టీడీపీ నేతలు

  సర్కారు తీరుపై టీడీపీ శ్రేణుల మండిపాటు 

  గుంతల్లో వరినాట్లు వేసి నిరసన 

సాలూరు, అక్టోబరు 17: కనీసం రోడ్లు బాగు చేయలేని ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుందో అర్థం కావడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంఽఽధ్యారాణి అన్నారు. సోమవారం టీడీపీ శ్రేణులతో కలిసి పట్టణంలోని మక్కువ రోడ్‌లోని గుంతల్లో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పేర్లు మార్పుపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు. గిరి శిఖర గ్రామస్థులకే కాదు మైదాన ప్రాంతవాసులకు కూడా రహదారి కష్టాలు తప్పడం లేదన్నారు. అడుగుకో గుంత ఏర్పడడం వల్ల సకాలంలో వైద్యసేవలు కూడా పొందలేకపోతున్నారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా.. ఎవరికీ పట్టడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు స్పందించి రహదారుల నిర్మాణంపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌, పట్టణ నాయకులు నిమ్మాది చిట్టి, పరమేష్‌, వాడాడ శోభారాణి, బాలాజీ, పూసర్ల నర్సింగరావు పాల్గొన్నారు. 



Updated Date - 2022-10-18T04:36:38+05:30 IST