రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు బొప్పడాం విద్యార్థులు
ABN , First Publish Date - 2022-12-15T00:14:00+05:30 IST
అనంతరపురం జిల్లాలో జరుగునున్న రాష్ట్రస్థాయి అండర్-14, 17 విభాగాల్లో హాకీ పోటీలకు బొప్పడాం ఉన్నత పాఠశాలకు చెందిన 18 మంది విద్యార్థులు ఎంపికైనట్టు హెచ్ఎం ఎం.నగేష్‌కుమార్, పీఈటీ ఎర్ర సూర్యారావు బుధవారం తెలిపారు.
నెల్లిమర్ల: అనంతరపురం జిల్లాలో జరుగునున్న రాష్ట్రస్థాయి అండర్-14, 17 విభాగాల్లో హాకీ పోటీలకు బొప్పడాం ఉన్నత పాఠశాలకు చెందిన 18 మంది విద్యార్థులు ఎంపికైనట్టు హెచ్ఎం ఎం.నగేష్‌కుమార్, పీఈటీ ఎర్ర సూర్యారావు బుధవారం తెలిపారు. పాఠ శాలకు చెందిన చందక పల్లవి, వేముల మౌనిక, కూరమా లక్ష్మీప్రసన్న, పంచాది అనూష, అంబళ్ల మనీషా, హాసిని, గేదెల హైమావతి, దన్నాన సుకన్య, వేముల లక్ష్మణరావు, సిరాయాల పవన్, బల్లయశ్వంత్ రెడ్డి, దినేష్, బల్ల చంద్రశేఖర్, మీసాల జగదీష్, బొమ్మిడి తరుణ్‌కుమార్, కొత్తకోట్ల శశిధర్, బట్టు దుర్గాప్రసాద్ ఎంపికయ్యారన్నారు. వీరిని హెచ్ఎం, సర్పంచ్ కిరణ్ కుమార్, ఎంపీటీసీ బిజపు రుషోత్తంనాయుడు, స్వామినాయుడు అభినందించారు.
- దత్తిరాజేరు: మరడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్టు పీడీ లంక సునీత తెలిపారు. వీరు జిల్లాస్థాయి హాకీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. వీరంతా అనంతపురంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం బంగార్రాజు, ఉపాధ్యాయులు అభినందించారు.