వంగవీటి రంగా వర్ధంతి

ABN , First Publish Date - 2022-12-27T00:05:27+05:30 IST

నగరం లోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో జీఎస్సార్‌ హోటల్‌లో సోమవారం వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.

 వంగవీటి రంగా వర్ధంతి
నివాళులు అర్పిస్తున్న యువకులు

విజయనగరం దాసన్నపేట: నగరం లోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో జీఎస్సార్‌ హోటల్‌లో సోమవారం వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ముం దుగా రంగా చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త గురాన అయ్యలు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు రంగా అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పవన్‌ కుమార్‌, మణికం ఠ, మహేష్‌, భాష, రాజేష్‌ పాల్గొన్నారు. తెలగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెవెన్యూ హోంలో రంగా వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలగ సంక్షేమ సంఘం ప్రతిని ధులు జి.నర్సింగరావు, హేమల పద్మజ, ఈశ్వరరావు, రామారావు, చనుమల్లు ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-27T00:05:30+05:30 IST