విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-12-15T23:57:52+05:30 IST

ప్రముఖ వ్యక్తుల భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆనందబాబు అన్నారు.

విధి నిర్వహణలో   అప్రమత్తంగా ఉండాలి

విజయనగరం క్రైం: ప్రముఖ వ్యక్తుల భద్రతా సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆనందబాబు అన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీపీ ఆదేశాల మేరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న పీఎస్‌వో లలో రెండో బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమం గురువారం స్థానిక పీటీసీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రిన్సి పాల్‌ ఆనందబాబు మాట్లాడుతూ, శిక్షణ కాల సమయంలో భద్రత సిబ్బంది విధు ల్లో ఏ విధంగా అప్రమత్తంగా వ్యవహరించాలి, ఇండోర్‌, ఔట్‌డోర్‌పై శిక్షణ అందిస్తు న్నామన్నారు. శిక్షణలో అంశాలను నేర్చుకుని విధల్లో సేవా భావంతో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ ఆశీర్వాదం, పీటీసీ వైఎస్‌ ప్రిన్సిపాల్‌ పీవీ అప్పారావు, పీటీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:57:53+05:30 IST