మాదక ద్రవ్యాలపై కఠినంగా ఉండండి

ABN , First Publish Date - 2022-08-18T04:49:10+05:30 IST

జిల్లాలో సారా, మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు.

మాదక ద్రవ్యాలపై కఠినంగా ఉండండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

  కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, ఆగస్టు 17 : జిల్లాలో సారా, మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు, వినియోగంపై  కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సారా, మాదక ద్రవ్యాల నియంత్రణ, విపత్తుల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా, మాదక ద్రవ్యాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. వాటి నివారణకు కృషి చేయాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలు అధికంగా కురిసే సమయంలో పునరావాస గ్రామాలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ.. సారా, మాదక ద్రవ్యాలతో సంబంధం కలిగిన 265 మందిని గతేడాది అరెస్టు చేశామన్నారు.   ఈ ఏడాది 431 మందిని అరెస్టు చేశామని చెప్పారు. సారా వినియోగం వల్ల ఎక్కడైనా మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.  ఈ సమావేశంలో  జేసీ ఒ.ఆనంద్‌, డీఆర్‌వో జె.వెంకటరావు, సబ్‌ కలెక్టర్‌ భావ్న, రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.హేమలత, డీఎస్పీలు ఎ.సుభాష్‌, శ్రావణి, రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.


Read more