బీసీలకు న్యాయం చేయాలి
ABN , First Publish Date - 2022-12-07T23:55:57+05:30 IST
విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న బీసీలకు ప్రభుత్వం న్యాయం చేయాలని టీడీపీ నియోజకవర్గ నాయకులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు తదితరుల డిమాండ్ చేశారు.
విజయనగరం రూరల్: విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న బీసీలకు ప్రభుత్వం న్యాయం చేయాలని టీడీపీ నియోజకవర్గ నాయకులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు తదితరుల డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ బంగార్రాజుకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం బీసీలను పక్కదారి పట్టించిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వేచలపు శ్రీను, కోండ్రు శ్రీనివాసరావు, రమ అప్పలనాయుడు, పీతల కోదండరామ్, బాష తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తున్న దృశ్యం