వరద వెం‘బడి’

ABN , First Publish Date - 2022-07-06T05:24:04+05:30 IST

గుర్ల మండలం బూర్లెపేట గ్రామంలో ఉన్న పాఠశాల గదులు చెరువును తలపించాయి. వర్షాలకు చేరిన వరద నీటిలో పాఠశాల విద్యార్థులు తొలిరోజే ఇక్కట్లు పడుతూ కనిపించారు.

వరద వెం‘బడి’
వర్షం నీటిలో బూర్లెపేట పాఠశాల


గుర్ల, జూలై 5: గుర్ల మండలం బూర్లెపేట గ్రామంలో ఉన్న పాఠశాల గదులు చెరువును తలపించాయి. వర్షాలకు చేరిన వరద నీటిలో పాఠశాల విద్యార్థులు తొలిరోజే ఇక్కట్లు పడుతూ కనిపించారు. వారి ఇబ్బందులను చూసి చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. నీరు తోడే అవకాశం కూడా లేకపోవడంతో బెంచీలపై కూర్చొండిపోయారు. పాఠశాల భవనం శిథిలావస్ధకు చేరిందని అధికారులు, నేతలకు అనేకసార్లు విన్నవించామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. వర్షం వస్తే పాఠశాల ఆవరణంతా నీటితో మునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాల తెరిచిన రెండు గంటల్లోనే వర్షం కురవడంతో నీరంతా గదుల్లోకి చేరింది. నాడునేడు పథకాన్ని కూడా ఈ పాఠశాలకు వర్తింపజేయడం లేదు.


Read more