అక్రమాలపై ఆరా!

ABN , First Publish Date - 2022-11-17T00:24:26+05:30 IST

కుమిలి గ్రామంలో శ్మశానవాటిక నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఉపాధి హామీ కేంద్ర బృందం బుధవారం గ్రామానికి వచ్చింది. మే నెలలో శ్మశానవాటిక నిర్మాణం కాకుండా బిల్లులు మంజూరు చేయించుకొన్నట్లు వచ్చిన ఆరోపణలపై సభ్యులు ఆరా తీశారు.

అక్రమాలపై ఆరా!
శ్మశానవాటిక పనులకు కొలతలు తీస్తున్న కేంద్రం బృందం అధికారులు

-------

కుమిలి శ్మశానవాటిక నిర్మాణం.. నిధులపై అనుమానాలు

పూసపాటిరేగ, నవంబరు 16: కుమిలి గ్రామంలో శ్మశానవాటిక నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఉపాధి హామీ కేంద్ర బృందం బుధవారం గ్రామానికి వచ్చింది. మే నెలలో శ్మశానవాటిక నిర్మాణం కాకుండా బిల్లులు మంజూరు చేయించుకొన్నట్లు వచ్చిన ఆరోపణలపై సభ్యులు ఆరా తీశారు. రికార్డులను తనిఖీ చేశారు. కొన్ని పనులు ఈమధ్యే జరిగినట్లు గుర్తించారు. నివేదికను ఉన్నతాధికా రులకు అందజేస్తామని సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి వైవీవీ వరప్రసాద్‌ తెలిపారు. పనులకు సంబంధించి ఇంతవరకూ చెల్లింపులు చేయనట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. పతివాడ పంచాయతీలోనూ ఉపాధి పనుల్లో అవినీతి చోటుచేసుకొందని ఫిర్యాదు వచ్చిందన్నారు. అక్కడ కూడా పరిశీలించాలని టీడీపీ నాయకులు కోరగా కుమిలిలో మాత్రమే పరిశీలించాలని తమకు ఆదేశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. బృందం వెంట ఎం.నాగరాజు, బి.కళ్యాణచక్రవర్తి, బి.రాము, కనకరాజు తదితరులు ఉన్నారు.

అవినీతిపై అనుమానాలు

- కుమిలిలో శ్మశాన వాటిక నిర్మాణ పనులకు సంబంధించి ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో ముగుస్తుండటంతో పనులకు ఆదరాబాదరాగా అంచనాలు వేసి సుమారు 6లక్షలు ఖర్చు చేసినట్లు ఎమ్‌ బుక్‌ రికార్డు చేశారు. ఎఫ్‌టీవో కూడా జనరేట్‌ చేశారు. మే నెలలో డ్వామా పీడీ పరిశీలిస్తే జనరేట్‌ అయిన నిధుల మొత్తానికి అక్కడ పనులు కానరాలేదు.

- శ్మశాన వాటికలోని దహన భవనం, స్నానపుగదులు, దుస్తులు మార్చుకొనేందుకు గదులు, విశ్రాంతి గది నిర్మించాల్సి ఉంది. రూ.6లక్షల వరకూ నిధులకు ఎఫ్‌టీవో జనరేట్‌ చేశారు. ఆమెత్తం ఇంకా అందలేదని కాంట్రాక్టర్‌, అధికారులు చెబుతున్నారు. పనులకు మించి ముందుగానే ఎఫ్‌టీవో జనరేట్‌ చేశారనేది ఫిర్యాదు.

Updated Date - 2022-11-17T00:24:29+05:30 IST