నిలిచిన ఏకలవ్య గెస్ట్‌ టీచర్ల నియామకం

ABN , First Publish Date - 2022-09-14T05:19:14+05:30 IST

ఐటీడీఏ పరిధిలో మెళియాపుట్టి, భామిని మండలాల్లో నిర్వహిస్తున్న ఏకలవ్య పాఠశాలల్లో గెస్ట్‌ ఉపాధ్యాయుల నియామకం నిలిచిపోయింది.

నిలిచిన ఏకలవ్య గెస్ట్‌ టీచర్ల నియామకం

సీతంపేట: ఐటీడీఏ పరిధిలో మెళియాపుట్టి, భామిని మండలాల్లో నిర్వహిస్తున్న ఏకలవ్య పాఠశాలల్లో గెస్ట్‌ ఉపాధ్యాయుల నియామకం నిలిచిపోయింది. ఇటీవల ఆయా పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. అభ్యర్థుల మెరిట్‌ జాబితాను కూడా తయారు చేశారు. ఈనెల ఏడో తేదీన వెన్నెలవలస నవోదయ పాఠశాలలో ఎంపికైన అభ్యర్థులకు డెమో తరగతులు కూడా నిర్వహించారు. ఈ మేరకు 1:4 ప్రాతిపదికన ఎంపిక జాబితాను తయారు చేసి కలెక్టర్‌ అనుమతికోసం పంపించారు. ఈ నేపథ్యంలో అతిథి ఉపాధ్యాయులుగా గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కాగా కోర్టు ఆదేశాల మేరకు నియామక ఉత్తర్వులు నిలిపివేశామని ఎడ్యుకేషన్‌ ఓఎస్‌డీ యుగంధర్‌ మంగళవారం తెలిపారు. తదుపరి కోర్టు ఉత్తర్వులు వెలువడించిన వరకు నియామకం జరగదని చెప్పారు.


Read more