ఆర్బీకేలకు అద్దె ఏదీ?

ABN , First Publish Date - 2022-12-31T00:31:42+05:30 IST

జిల్లా వ్యాప్తంగా రైతుభరోసా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ఇంకా భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్నిచోట్ల స్థలభావం, ఇతరత్రా కారణాలతో నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ప్రస్తుతానికి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే గత ఆరు నెలలుగా వీటికి అద్దె చెల్లించడం లేదు. దీంతో యజమానులు ఒత్తిడి చేస్తున్నారు.

ఆర్బీకేలకు అద్దె ఏదీ?
రామవరంలోని ఆద్దె భవనంలో రైతు భరోసా కేంద్రం

ఆర్బీకేలకు అద్దె ఏదీ?

ఆరునెలలుగా అద్దె పెండింగ్‌

ఒత్తిడిచేస్తున్న యజమానులు

అసౌకర్యానికి గురవుతున్న సిబ్బంది

(కలెక్టరేట్‌)

జిల్లా వ్యాప్తంగా రైతుభరోసా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ఇంకా భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్నిచోట్ల స్థలభావం, ఇతరత్రా కారణాలతో నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ప్రస్తుతానికి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే గత ఆరు నెలలుగా వీటికి అద్దె చెల్లించడం లేదు. దీంతో యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వ్యవసాయ సహాయకులు అసౌకర్యానికి గురవుతున్నారు. అద్దె ఎప్పుడిస్తారు అంటూ వారు ప్రశ్నించేసరికి ఏం చెప్పాలో తెలియడం లేదు. కొన్నిచోట్ల యజమానులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఇలాగైతే ఖాళీ చేయాలని తెగేసి చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 510 రైతుభరోసా కేంద్రాలున్నాయి. అయితే చాలావరకూ గ్రామాల్లో ఉండే ప్రభుత్వ భవనాల్లో వీటిని కొనసాగిస్తున్నారు. 143 ఆర్బీకేలు మాత్రం ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. తొలుత భవనాలు అద్దెకు తీసుకున్న సమయంలో.. భవనం వెడల్పు, పొడుగు ప్రకారం ఆద్దె నిర్ణయించారు. దీనికి అనుగుణంగా అద్దె చెల్లిస్తూ వస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా లక్షలాది రూపాయల అద్దెలు పేరుకుపోయాయి.

ఆ 26 చోట్ల ఇన్‌చార్జిలే..

రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు సమస్య ఉంది. సిబ్బంది కొరత ఉండటంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. జిల్లాలోని 510 రైతు భరోసా కేంద్రాలు ఉండగా, 484 కేంద్రాల్లో సహాయకులు ఉన్నారు. మిగిలిన 26 చోట్ల సిబ్బంది లేకపోవడంతో ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. ప్రసుత్తం ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుండడంతో రెండుచోట్ల విధులు నిర్వహిస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి చోట పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-31T00:31:44+05:30 IST