నదిలో పడి వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2022-12-15T00:18:30+05:30 IST
ప్రమాదవశాత్తు సువర్ణముఖి నదిలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన డి.శిర్లాం గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది.
మక్కువ: ప్రమాదవశాత్తు సువర్ణముఖి నదిలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన డి.శిర్లాం గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని కోన గ్రామానికి చెందిన తుడు ము గౌరయ్య (75) కొన్నాళ్లగా అల్లుడు సింగనాపురి తిరుపతి వద్ద ఉంటున్నాడు. గౌరయ్య మానసిక స్థితి బాగోలేదు. కొద్ది రోజుల కిందట ఇంటి నుంయి బయటకి వెళ్లి తిరిగిరాలేదు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో బుధవారం డి.శిర్లాం సమీపాన సువర్ణముఖి నదిలో మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జి.పైడిరాజు సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.