అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-11-30T00:05:58+05:30 IST

అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు సువ్వాడ రవిశేఖ ర్‌, పార్టీ మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌ కుమార్‌ అన్నారు.

అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలి

నెల్లిమర్ల: అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు సువ్వాడ రవిశేఖ ర్‌, పార్టీ మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌ కుమార్‌ అన్నారు. ఓటర్ల నమో దు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన అంశంపై కొండవెలగాడలో ఏర్పా టుచేసిన కార్యక్రమంలో వారు పాల్గొని, మాట్లాడారు. ఓటర్ల నమోదుపై పార్టీ కార్యకర్తలు అవగాహన కల్పించాల న్నారు. కొత్తగా గ్రామానికి వలస వచ్చిన వారి పేర్లను, కొత్త కోడళ్ల పేర్లను చేర్చాలన్నారు. మరణించిన వారి పేర్లను తొలగించేలా బీఎల్వోలకు, రెవెన్యూ సిబ్బందికి సూచించాలన్నారు. అనంతరం కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడు తున్న టీడీపీ సీనియర్‌ నాయ కుడు, మాజీ జడ్పీటీసీ డి.శంకర సీతారామ రాజు (సింగుబాబు) ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమం లో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, జిల్లా కార్యదర్శి లెంక అప్పలనాయుడు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతల రాజప్పన్న, నగర పంచాయతీ నాయకుడు, కౌన్సిలర్‌ అవనాపు సత్యనారాయణ, పార్టీ నాయకు డు బెల్లాన రాజినాయుడు తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:05:58+05:30 IST

Read more