కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలి
ABN , First Publish Date - 2022-12-16T23:48:07+05:30 IST
చంద్రబాబునాయుడు ఈనెల 22న ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్ర మంలో భాగంగా రాజాం రానున్న నేపథ్యంలో రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాల కార్యకర్తలు, నేతలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ప్రసాద్ పిలుపునిచ్చారు.
రేగిడి: చంద్రబాబునాయుడు ఈనెల 22న ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్ర మంలో భాగంగా రాజాం రానున్న నేపథ్యంలో రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాల కార్యకర్తలు, నేతలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం రేగిడి మాజీ ఎంపీపీ కిమిడి రామకృష్ణంనాయుడు నివాసానికి వెళ్లి చంద్రబాబు పర్యటన విజయవంతం, చంద్రబాబు వద్ద తన అభ్యర్థిత్వం బలపరిచేందుకు సహకరించాలని నేతలు, కార్యకర్తలతో చర్చించారు.
రాజాం అసెంబ్లీ టికెట్ రేసులో ఉన్నా: గ్రీష్మ
ఫ రాజాం అసెంబ్లీ టికెట్ రేసులో తాను ఉన్నట్లు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతి నిధి కావలి గ్రీష్మప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆమె స్థానిక విలేఖర్లతో మాట్లాడా రు. నియోజకవర్గంలో బలమైన క్యాడర్ తన వెంట ఉందని, రానున్న ఎన్నికల్లో రాజాం అసెంబ్లీకి పోటీ చేసేందుకు యోచిస్తున్నానని ఆమె వెల్లడించారు. ఇప్పటికే రేగిడి మాజీ ఎంపీపీ కిమిడి రామకృష్ణంనాయుడు, రాజాం, వంగర, సంతకవిటి ము ఖ్యనేతలు, వారి అనుచరులతో మాట్లాడి నాలుగు మండలాల క్యాడర్ను కలిసి మద్దతు కోరినట్లు తెలిపారు. వంగర మాజీ ఎంపీపీ పైల వెంకటరమణ, బి.త్రినాథ రావు, పొడుమటివలస మాజీ సర్పంచ్ కేశవరావు, రేగిడి టీడీపీ నేతలు టెంకాల గోవిందరావు, తెంటు కృష్ణ, వంగర, రేగిడి మండలాల టీడీపీ క్యాడర్ ఉన్నారు.