చురుగ్గా ధాన్యం కొనుగోలు: జేసీ

ABN , First Publish Date - 2022-12-15T23:50:26+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోందని, రైతులకు నగదు చెల్లింపులు కూడా ప్రారంభ మయ్యాయ ని జేసీ ఆనంద్‌ తెలిపారు.

చురుగ్గా ధాన్యం కొనుగోలు: జేసీ

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోందని, రైతులకు నగదు చెల్లింపులు కూడా ప్రారంభ మయ్యాయ ని జేసీ ఆనంద్‌ తెలిపారు. గురువా రం పార్వతీపురంలోని కలెకరేట్‌లో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగు తోందని చెప్పారు. ఇప్పటివరకూ రూ.27.15 కోట్ల విలువ గల 13,310.64 మెట్రి క్‌ టన్నుల ధాన్యాన్ని 2,344 మంది రైతుల నుంచి కొనుగోలుచేశామని ,రూ. 8.69 కోట్ల చెల్లించామని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్‌ దేవుళ్ల నాయక్‌, డీఎస్‌వో కేవీఎల్‌ఎన్‌ మూర్తి, రైస్‌ మిల్లర్ల అసోసి యేషన్‌ అధ్యక్షులు కొత్తకోట రమేష్‌, ఉపాధ్యక్షుడు ఉదయభాను పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:50:28+05:30 IST