ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-31T00:30:53+05:30 IST

జిల్లాలోని బాడంగి మం డలం వీరసాగరం గ్రామంలో ఆదివాసీ కుటుంబం సాగు చేసుకుంటున్న సొసైటీ చెరువు లను ఆక్రమించిన గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని వీరసాగరం ఆదివాసీ మత్స్యకార సంఘం ప్రతినిధులు లక్ష్మణరావు, రమేష్‌ డిమాండ్‌ చేశారు.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి

విజయనగరం దాస న్నపేట: జిల్లాలోని బాడంగి మం డలం వీరసాగరం గ్రామంలో ఆదివాసీ కుటుంబం సాగు చేసుకుంటున్న సొసైటీ చెరువు లను ఆక్రమించిన గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని వీరసాగరం ఆదివాసీ మత్స్యకార సంఘం ప్రతినిధులు లక్ష్మణరావు, రమేష్‌ డిమాండ్‌ చేశారు. చెరువును ఆక్రమించిన అక్ర మణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట చేస్తున్న రిలే దీక్షకు బీఎస్పీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ, రాజీవ్‌గాంధీ, స్వదేశీ పారిశ్రామిక సహకార సంఘానికి కేటాయించిన 17 చేపల చెరువులను తక్షణమే ఆదివాసీలకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. బీఎ స్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోము రాంబాబు మాట్లాడుతూ బాడంగి ఆక్రమణ దారులను వెంటనే అరెస్టుచేసి చెరువులను ఆదివాసీలకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. బీఎస్పీ నాయకులు సాంబయ్య, కొమ్ము సోములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:30:54+05:30 IST