ప్రమాదవశాత్తు శ్లాబు కూలి..

ABN , First Publish Date - 2022-12-16T23:48:37+05:30 IST

ప్రమాదవశాత్తు శ్లాబు కూలి భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందాడు.

ప్రమాదవశాత్తు శ్లాబు కూలి..

విజయనగరం క్రైం: ప్రమాదవశాత్తు శ్లాబు కూలి భవన నిర్మాణ కార్మికుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జమ్ము అప్పలనాయుడు(45) అనే భవన నిర్మాణ కార్మికుడు శుక్రవారం ఎస్‌వీఎన్‌ నగర్‌లోని పొట్నూరి మోహనరావు ఇంటికి సంబంధించి శ్లాబ్‌ సెంటరింగ్‌ తీసేందుకు వెళ్లాడు. సెంటరింగ్‌ తీస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా శ్లాబ్‌ కూలిపోయింది. దీంతో అప్పలనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈయ న నెల్లిమర్ల మండలం ఏటీ అగ్రహారంలో నివాసం ఉంటున్నాడు. టూటౌన్‌ సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ లక్ష్మీప్రసన్నకుమార్‌, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కేంద్రాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T23:48:39+05:30 IST