ద్విచక్ర వాహనం, బస్సు ఢీ.. ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2022-12-16T23:51:19+05:30 IST

కోట సీతారాంపురం గ్రామ సమీపంలో శుక్రవారం ఓ ప్రైవేటు బస్సు, ద్విచక్ర వాహనం ఢీకున్నాయి.

 ద్విచక్ర వాహనం, బస్సు ఢీ..  ఇద్దరికి గాయాలు

సీతానగరం: కోట సీతారాంపురం గ్రామ సమీపంలో శుక్రవారం ఓ ప్రైవేటు బస్సు, ద్విచక్ర వాహనం ఢీకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. మక్కువ మండలం కొయ్యానపేట గ్రామానికి చెందిన ఎం.నారాయణరావు, సింహాచలం కలిసి గాదెలవలస గ్రామంలో తన బంధువుల ఇంటికి స్కూటీపై వెళ్తున్నారు. సీతారాంపురం గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. దీంతో వారిద్దరూ గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ నీలకంఠం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T23:51:21+05:30 IST