రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-10-07T05:33:24+05:30 IST

రైలు ఢీకొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

దత్తిరాజేరు: రైలు ఢీకొని ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పెదమానాపురం గ్రామానికి చెందిన బి.మహేష్‌ బుధవారం పొలానికి వెళ్లేందుకు పెదమానాపురం రైల్వే ట్రాకును కోమటిపల్లి రైల్వే స్టేషన్‌ మధ్యలో దాటుతుండగా రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో మహేష్‌ను 108 వాహనంలో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. భార్య గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2022-10-07T05:33:24+05:30 IST