సముద్రపు ఇసుకతో పట్టుబడిన లారీ
ABN , First Publish Date - 2022-12-15T00:17:40+05:30 IST
రెడ్డికంచేరు గ్రామ సమీపంలో సముద్రపు ఇసుకను తరలిస్తున్న లారీ పట్టుబడినట్టు ఎస్‌ఐ ఎస్.కృష్ణమూర్తి బుధవారం తెలిపారు.
భోగాపురం: రెడ్డికంచేరు గ్రామ సమీపంలో సముద్రపు ఇసుకను తరలిస్తున్న లారీ పట్టుబడినట్టు ఎస్‌ఐ ఎస్.కృష్ణమూర్తి బుధవారం తెలిపారు. చేపలకంచేరు వైపు నుంచి జాతీయ రహదారి వైపు సముద్రపు ఇసుకతో వస్తున్న లారీని స్థానికులు రెడ్డికంచేరు సమీపంలో అడ్డుకుని పోలీసులకు స మాచారం ఇచ్చారు. దీంతో డ్రైవర్ అ క్కడి నుంచి పరారయ్యాడు. లారీని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.