ఇంటింటా సర్వే నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-12-07T23:58:50+05:30 IST
ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా బీఎల్ వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించాలని, అర్హత ఉన్న వారికి ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు.
కలెక్టరేట్: ఓటు నమోదు ప్రక్రియలో భాగంగా బీఎల్ వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించాలని, అర్హత ఉన్న వారికి ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ఉన్న 219 బీఎల్‌వోలతో బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు నమోదు ప్రక్రియ పారదర్శంగా చేపట్టాలని, అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకూడదని చెప్పారు. క్షేత్రస్థాయిలో తప్పి దాలు జరగకుండా చూడాలన్నారు. వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌వో గణపతిరావు, కార్పొరేషన్ కమిషనర్ రెడ్డి శ్రీరాములునా యుడు, సహాయ కమిషనర్ ప్రసాదరావు, తహసీల్దార్ బంగార్రాజు తదితరలు పాల్గొన్నారు.
- సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడే సైనికులు, వీరజవాన్ల కుటుంబాలకు చేయూతనందిం చా లన్నారు. పెద్ద ఎత్తున విరళాలు ఇచ్చి వారి త్యాగాలను గౌ రవించాలని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు.
- రీసర్వే చేస్తున్నప్పుడు రైతులు దగ్గరుండి తమ భూముల కొలతలు తీయించుకోవాలని కలెక్టర్ సూర్యకుమా రి ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని 24 మండ లాల్లో 179 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తయ్యిందన్నారు.