ఆరోగ్య సర్వే త్వరగా పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-12-07T00:01:34+05:30 IST

ఐదేళ్లలోపు పిల్లల ఆరోగ్య సర్వే త్వరగా పూర్తిచేసి సంబంధిత శాన్స్‌ యాప్‌లో వివరాలు నమోదు చేయాలని, లెప్రసీ సర్వేలో లక్షణాల గుర్తించిన వారికి వెంటనే పరీక్షలు చేపట్టాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి జగన్మోహనరావు తెలిపారు.

  ఆరోగ్య సర్వే త్వరగా పూర్తిచేయాలి

సీతానగరం: ఐదేళ్లలోపు పిల్లల ఆరోగ్య సర్వే త్వరగా పూర్తిచేసి సంబంధిత శాన్స్‌ యాప్‌లో వివరాలు నమోదు చేయాలని, లెప్రసీ సర్వేలో లక్షణాల గుర్తించిన వారికి వెంటనే పరీక్షలు చేపట్టాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి జగన్మోహనరావు తెలిపారు. మంగళవారం పెదంకలాం, సీతానగరం పీహెచ్‌సీల్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణుల నమోదు ప్రక్రియ మొదటి మూడు నెలల్లోపే జరగాలని తెలిపారు.కాన్పుల మధ్య నిర్ణీత సమయం ఉండాలని, ఇందుకు అంతర పీపీయూసీడీ పద్ధతులపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతినెలా తొమ్మిదో తేదీన ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే పీఎంఎస్‌ఎం కార్యక్రమానికి గర్భిణులకు పూర్తిస్థాయిలో పరీక్షలు జరిగేలా చర్యలుతీసుకోవాలి కోరారు. ఫ్యామిలీ డాక్టర్‌ప్రాగ్రాం పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. అనంతరం బూర్జలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్య క్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు రాధాకాంత్‌, శిరీష, ఉషారాణి, సూపర్‌వైజర్లు , ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు , 104 సిబ్బంది దుర్గారావు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:01:38+05:30 IST