సిరిమానోత్సవానికి 3 లక్షల మంది భక్తులు
ABN , First Publish Date - 2022-10-08T05:17:50+05:30 IST
పైడిమాంబ సిరిమానోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఈ ఏడాది సిరిమాను పండుగకు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్ నేపథ్యంలో ఆంక్షల నడుమే అమ్మవారి సిరిమాను సంబరం జరిగింది. దీంతో భక్తులు నిరాశకు గురయ్యారు. దీంతో ఈ ఏడాది తప్పకుండా హాజరయ్యేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు నిర్ణయించుకున్నారు. అందుకే అంచనాకు మించి భక్తులు వస్తారని
అంచనా వేస్తున్న దేవదాయ శాఖ
అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు
40 వేల లడ్డూలు సిద్ధం
(విజయనగరం రూరల్)
పైడిమాంబ సిరిమానోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. యంత్రాంగం ఏర్పాట్లలో తలమునకలై ఉంది. ఈ ఏడాది సిరిమాను పండుగకు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్ నేపథ్యంలో ఆంక్షల నడుమే అమ్మవారి సిరిమాను సంబరం జరిగింది. దీంతో భక్తులు నిరాశకు గురయ్యారు. దీంతో ఈ ఏడాది తప్పకుండా హాజరయ్యేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు నిర్ణయించుకున్నారు. అందుకే అంచనాకు మించి భక్తులు వస్తారని దేవదాయ శాఖ భావిస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. దసరా సెలవులతో ఇప్పటికే చాలామంది భక్తులు, స్థానికులు నగరానికి చేరుకున్నారు. ఈ నెల 10న తొలేళ్ల ఉత్సవం జరగనుంది. ఆదివారం నుంచి విజయనగరానికి జన తాకిడి పెరగనుంది. వీఐపీ పాస్‌లు లేకుండా రూ.300 టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. బ్యాంకులు ద్వారా జారీచేస్తున్న టిక్కెట్లకు విశేషస్పందన లభిస్తోంది. అటు అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం 40 వేల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. పైడిమాంబ కళ్యాణమండపంలో దేవదాయ శాఖ సిబ్బంది లడ్డూను తయారుచేసే పనిలో ఉన్నారు. ఆదివారం నాటికి లడ్డూలు అందుబాటులోకి రానున్నాయి. మరో 10 వేల లడ్డూలకు సంబంధించి మెటీరియల్ సిద్ధం చేశారు. పులిహోరాను అప్పటికప్పుడు తయారుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి అధికారులు, పోలీస్ సిబ్బందిని నియమించనున్నారు. దేవదాయ శాఖకు సంబంధించి 103 అర్చకులను నియమించారు. ఇప్పటికే పైడిమాంబ సిరిమానోత్సవ ప్రత్యేక అధికారిగా అన్నవరం దేవస్థానం ఈవో మూర్తిని నియమించారు. సిరిమానోత్సవం ప్రక్రియ సకాలంలో ప్రారంభమై, నిర్ధేశించిన సమయంలోగా ముగించాలని ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకుగాను శుక్రవారం తహసీల్దారు బంగార్రాజు, టూటౌన్ సీఐ లక్ష్మణరావు సిబ్బందితో సమావేశమయ్యారు.
.