పాము కాటుకు యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-04T06:54:10+05:30 IST

పాము కాటుకి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన షీలానగర్‌ సమీపంలోని గొడౌన్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

పాము కాటుకు యువకుడి మృతి
మృతి చెందిన అనీల్‌

మృతుడి స్వస్థలం గుంటూరు!

అక్కిరెడ్డిపాలెం, ఆగస్టు 3: పాము కాటుకి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన షీలానగర్‌ సమీపంలోని గొడౌన్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. షీలానగర్‌ సమీపంలో వున్న గొడౌన్ల వద్దకు మంగళవారం ఓ యువకుడు వచ్చి తన పేరు కె.అనీల్‌ (25) అని, తమ సొంతూరు గుంటూరు అని చెప్పి తనకు ఏదైనా పని ఇవ్వాలని ఇక్కడి కళాసీలను కోరాడు. అయితే గొడౌన్‌ యజమానిని కానీ సూపర్‌వైజర్‌ను గానీ కలవాలని వారు సూచించారు. అప్పటికే రాత్రి కావడంతో అక్కడే భోజనం చేసిన అనీల్‌ కళాసీలతో కలిసి గొడౌన్‌లోనే నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో అనీల్‌తో పాటు మరో కళాసీని పాము కరవడంతో వారిద్దరినీ మిగతా కళాసీలు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనీల్‌ బుధవారం మృతి చెందగా, కళాసీ కోలుకుంటున్నాడు. కాగా మృతి చెందిన యువకుడి చేతిపై ప్రభాస్‌ అని పచ్చబొట్టు తప్ప ఎటువంటి వివరాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మృతిచెందిన అనీల్‌ గురించి తెలిసిన వారెవరైనా వుంటే తమను సంప్రతించాలని గాజువాక సీఐ మల్లేశ్వరరావు కోరారు.


Updated Date - 2022-08-04T06:54:10+05:30 IST