నేటి నుంచి రాష్ట్ర స్థాయి యోగా పోటీలు

ABN , First Publish Date - 2022-11-12T01:12:31+05:30 IST

రాష్ట్ర యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ప్రారంభం కానున్నట్టు ఏపీ యోగా అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ పుల్లేటి సతీష్‌ తెలిపారు.

నేటి నుంచి రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
యోగా పోటీల వివరాలను వెల్లడిస్తున్న నిర్వాహకులు

చోడవరం, నవంబరు 11: రాష్ట్ర యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ప్రారంభం కానున్నట్టు ఏపీ యోగా అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ పుల్లేటి సతీష్‌ తెలిపారు. స్థానిక ఉషోదయ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో 8 నుంచి 80 ఏళ్ల కేటగిరీ వరకూ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలలో విజేతలకు వచ్చే నెల 26నుంచి 28వ తేదీల్లో పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి యోగా పోటీలలో పాల్గొంటారన్నారు. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 500 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని, వారందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్‌ జె. రమణాజీ, పతంజలి యోగ కేంద్రం గౌరవాధ్యక్షుడు పప్పల రమణమూర్తి, పసుమర్తి అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T01:12:31+05:30 IST

Read more