యారాడలో అలజడి

ABN , First Publish Date - 2022-09-28T06:48:32+05:30 IST

పర్యాటక ప్రాంతంగా పేరొందిన యారాడ బీచ్‌లో అలల ఉధృతి పెరుగుతోంది.

యారాడలో అలజడి
యారాడ తీరంలో ముందుకు వచ్చిన సముద్రం నీరు

ముందుకువచ్చిన సముద్రపు నీరు

తీవ్ర భయాందోళన చెందుతున్న గ్రామస్థులు


మల్కాపురం, సెప్టెంబరు 27:


పర్యాటక ప్రాంతంగా పేరొందిన యారాడ బీచ్‌లో అలల ఉధృతి పెరుగుతోంది. మంగళవారం మునుపెన్నడూ లేని విధంగా సముద్రపు నీరు సుమారు వంద మీటర్ల మేర ముందుకురావడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కెరటాల తాకిడికి తీరంలో గల తాటిచెట్లు కొన్ని నేలకొరిగి లోనికి కొట్టుకుపోయాయి. అంతేకాక సందర్శకులు రాకపోకలు సాగించే రోడ్డు వరకూ సముద్రపు నీరు వచ్చింది. నీటితోపాటు వచ్చిన వ్యర్థాలు రహదారిపై పేరుకుపోయాయి. కాగా గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో మత్స్యకారుల కోసమని సముద్రానికి వంద మీటర్ల దూరంలో జెట్టీని నిర్మించారు. ఈ జెట్టీపైకి కూడా సముద్రపు నీరు చొచ్చుకువచ్చింది. దీంతో తీవ్ర ప్రమాదం ఏదైనా ముందుకొస్తుందేమోనని గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. Read more