వీఆర్‌ఏలకు రూ.21 వేల వేతనం ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-03-05T06:26:29+05:30 IST
వీఆర్‌ఏలకు రూ.21 వేల వేతనం చెల్లించి, ప్రధాన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ నాయకుడు కె.లోకనాథం కోరారు.
సిరిపురం, మార్చి 4: వీఆర్‌ఏలకు రూ.21 వేల వేతనం చెల్లించి, ప్రధాన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ నాయకుడు కె.లోకనాథం కోరారు. జిల్లా గ్రామ సేవకుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, రెవెన్యూ సహాయకులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్ష,కార్యదర్శులు చిన్న అప్పారావు, లోవరాజు మాట్లాడుతూ నామినీలను వీఆర్‌ఏలుగా నియమించాలన్నారు. అర్హులకు పదోన్నతి కల్పించాలని, 65 ఏళ్లు దాటి చనిపోయిన వీఆర్‌ఏ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్‌తో ఈ నెల 10న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు రవికుమార్, సంతోష్‌కుమార్, శేఖర్‌రెడ్డి, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.