-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » visakha railway zone mp gvl narasimha rao andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
Railway zone: విశాఖ రైల్వేజోన్‌పై ఎంపీ జీవీఎల్ క్లారిటీ
ABN , First Publish Date - 2022-09-29T19:15:56+05:30 IST
రైల్వే జోన్ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు.

విశాఖపట్నం: రైల్వే జోన్ (Railway zone) ఏర్పాటుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimaha rao) క్లారిటీ ఇచ్చారు. రైల్వే బోర్డ్ ఛైర్మన్ వి.కే త్రిపాఠి (VK Tripathi)తో తాను స్వయంగా మాట్లాడానని... రైల్వే జోన్ రావడం లేదని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన కూడా ఖండించారని తెలిపారు. నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని తనతో స్పష్టంగా చెప్పారన్నారు. జోన్ ఏర్పాటు అంశంపై రైల్వే బోర్డులో నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని అన్నారు. రైల్వే బోర్డ్ ఛైర్మన్ (Railway board chairman) కన్నా పెద్ద అధికారి ఎవ్వరూలేరన్నారు. జోన్ ఏర్పాటును ఆయనే స్వయంగా ధృవీకరించారని... ఇక అయోమయాలు అవసరం లేదని ఎంపీ జీవీఎల్ (BJP MP) స్పష్టం చేశారు.