11,702 మందికి విద్యా దీవెన

ABN , First Publish Date - 2022-08-12T06:27:34+05:30 IST

విద్యా దీవెన చెక్కును అందిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ

11,702 మందికి విద్యా దీవెన

- తల్లుల ఖాతాల్లో రూ.4,77,98000 జమ 

పాడేరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా విద్యా దీవెన పథకంలో భాగంగా 11,702 మంది తల్లుల ఖాతాలో రూ.4 కోట్ల 77 లక్షల 98 వేలను ప్రభుత్వం జమ చేసింది. సీఎం జగన్‌ బాపట్లలో ఈ పథకాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించగా ఆ ప్రత్యేక్ష ప్రసారాన్ని స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పీవో రోణంకి గోపాలక్రిష్ణ, ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ మాట్లాడుతూ మనబడి నాడు- నేడు మొదటి దశలో 367 పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్ది మౌలికసదు పాయాలు కల్పించామన్నారు. ముంచంగిపుట్టు జూనియర్‌ కళాశాలకు రూ.1 కోటి 40 లక్షలు, అరకులోయ డిగ్రీ కళాశాలకు రూ.1 కోటి 50 లక్షలతో అదనపు వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాభివృద్ధికి పెద్దపీట వేస్తుం దన్నారు. విద్యారంగంలో అమ్మఒడి, సంపూర్ణ పోషణ, గోరుముద్దలు, విద్యా కానుక, మనబడి నాడు- నేడు, ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు, బైజూస్‌తో ఒప్పందం, ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకుని గిరిజన విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణలకు సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఉప సంచాలకుడు కొండలరావు, డీఈవో డాక్టర్‌ పి.రమేశ్‌ , ఏటీడబ్ల్యూవో ఎల్‌.రజని, ఎంఈవో సీహెచ్‌.సరస్వతి, వైఎస్‌ ఎంపీపీ కనకాలమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు జి.విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T06:27:34+05:30 IST