-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Use public transport one day a week-MRGS-AndhraPradesh
-
ప్రజా రవాణాను వారానికి ఒకరోజు వినియోగించాలి
ABN , First Publish Date - 2022-07-19T05:29:52+05:30 IST
కాలుష్య నియంత్రణలో భాగంగా నగరవాసుల్లో ప్రతిఒక్కరూ వారానికి ఒకరోజైనా సొంతవాహనాన్ని పక్కన పెట్టి ప్రజా రవాణా వాహనాలను వినియోగించాలని మేయర్ గొల గాని హరివెంకటకుమారి విజ్ఞప్తి చేశారు.

నగరవాసులకు మేయర్ హరివెంకటకుమారి విజ్ఞప్తి
విశాఖపట్నం, జూలై 18: కాలుష్య నియంత్రణలో భాగంగా నగరవాసుల్లో ప్రతిఒక్కరూ వారానికి ఒకరోజైనా సొంతవాహనాన్ని పక్కన పెట్టి ప్రజా రవాణా వాహనాలను వినియోగించాలని మేయర్ గొల గాని హరివెంకటకుమారి విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ ‘నో వెహికిల్ జోన్’ నిబంధనలో భాగంగా మూడో సోమ వారం కూడా మేయర్ ఆరిలోవలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బస్టాప్‌కు నడుచుకుంటూ వచ్చి బస్సులో జీవీఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు.
విధుల నిర్వహణ అనంతరం తిరిగి బస్సులోనే తన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటిలో రెండు మూడు వ్యక్తిగత వాహనాలు ఉంటున్నాయని, వారానికి ఒక్కరోజు ప్రజా రవాణా వాహనాన్ని వినియోగిస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతామన్నారు. దీనివల్ల కాలుష్య నియంత్రణకు సహకరించిన వారవుతారని చెప్పారు.ఇప్పటికే జీవీఎంసీ కమి షనర్ ఆదేశాలతో ఉద్యోగులు అంతా ప్రతి సోమవారం తమ వాహనాలు విడిచిపెట్టి పీటీడీ బస్సుల్లోనే కార్యాలయానికి రాకపోకలు సాగిస్తున్నారని గుర్తు చేశారు. అన్నివర్గాలు ఈ నిబంధన పాటించాలని విజ్ఞప్తి చేశారు.