ఏయూను సందర్శించిన అమెరికా నావికాదళ సిబ్బంది
ABN , First Publish Date - 2022-08-04T06:20:31+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని బుధవారం అమెరికాకు చెందిన నావికాదళ సిబ్బంది సందర్శించారు.
ఏయూ క్యాంపస్, ఆగస్టు 3: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని బుధవారం అమెరికాకు చెందిన నావికాదళ సిబ్బంది సందర్శించారు. వర్సిటీలోని పాలకమండలి సమావేశ మందిరంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) డిప్లమసీ ఆఫీసర్ డేవిడ్ మోయర్‌తోపాటు సిబ్బంది ఏయూ వీసీ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డేవిడ్ మోయర్ మాట్లాడుతూ ఏయూ సహకారంతో విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచే అమెరికన్ కార్నర్ ఏర్పాటు సాధ్యపడిందన్నారు. ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ వర్సిటీలో ఉన్నత విద్య అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుమని తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, ఆచార్యులు పాల్, జేమ్స్ స్టీఫెన్, హరనాథ్, విజయ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఏయూ ప్రాంగణంలో మొక్కలు నాటారు.