యూపీఎస్సీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-10-13T05:22:22+05:30 IST

యూపీఎస్సీ నిర్వహించబోతున్న కంబైన్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి అధికారులను ఆదేశించారు.

యూపీఎస్సీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

మహారాణిపేట, అక్టోబరు 12: యూపీఎస్సీ నిర్వహించబోతున్న కంబైన్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15, 16వ తేదీలలో ఈ పరీక్షలు జరుగనున్నాయని వివరించారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 1273 మంది హాజరుకానున్నారని తెలిపారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తోపాటు ఏదైనా గుర్తింపు కార్డును తప్పని సరిగా తీసుకురావాలని, పరీక్షా సమయానికి అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.


Read more