100 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-22T06:29:07+05:30 IST

ఆటోలో తరలిస్తున్న 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఈబీ సీఐ రాజారావు తెలిపారు.

100 కిలోల గంజాయి స్వాధీనం
స్వాధీనం చేసుకున్న గంజాయితో ఎస్‌ఈబీ సిబ్బంది

ఇద్దరిని అరెస్టు చేసిన ఎస్‌ఈబీ పోలీసులు


కొయ్యూరు, జనవరి 21: ఆటోలో తరలిస్తున్న 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఈబీ సీఐ రాజారావు తెలిపారు. జి.మాడుగుల మండలం నుంచి డౌనూరు మీదుగా గంజాయి రవాణ అవుతున్నట్టు సమాచారం అందడంతో శుక్రవారం మధ్యాహ్నం రొబ్బసింగి గ్రామ వద్ద సిబ్బందితో మాటు వేశామని ఆయన చెప్పారు. ఏజెన్సీ వైపు నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక ఆటోలో 100 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. దీనికి సంబంధించి జి.మాడుగులకు చెందిన కొండపల్లి పిన్నయ్య, చింతపల్లి మండలం కోరుకొండకు చెందిన మువ్వ చిట్టిబాబులను అరెస్టు చేసి, ఆటోని సీజ్‌ చేసినట్టు ఆయన చెప్పారు. 


Updated Date - 2022-01-22T06:29:07+05:30 IST