ఇద్దరు పదో తరగతి విద్యార్థులు అదృశ్యం
ABN , First Publish Date - 2022-10-17T07:05:27+05:30 IST
నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు.
పట్టణ పోలీసులకు ఫిర్యాదు
నర్సీపట్నం, అక్టోబరు 16: నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. పట్టణ సీఐ గణేశ్ అందించిన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం శివపురానికి చెందిన సింహాద్రి ఎలీషారాజు కుమారుడు మనోసాక్షిత్ (15), చెట్టుపల్లికి గ్రామానికి చెందిన బంటు అప్పారావు కుమారుడు హర్ష వర్థన్ (15) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. శనివారం యథావిధిగా ఇద్దరు స్కూల్‌కి వచ్చారు. సాయంత్రం స్కూల్ విడిచి పెట్టిన తర్వాత ఇద్దరు శివపురంలోని మనోసాక్షిత్ ఇంటికి వచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చారు. వారు ఎంత సేపటికీ రాకపోవడంతో బంధువులు ఆదివారం ఉదయం వరకు గాలించారు.వారి ఆచూకీ లేకపోవడంతో హర్షవర్థన్ మామయ్య పచ్చికారి రాజుబాబు, మనోసాక్షిత్ తండ్రి ఎలీషారాజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ గణేశ్ చెప్పారు.