మినీ మహానాడును జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-05-24T06:51:07+05:30 IST

అచ్యుతాపురంలో మంగళవారం జరగనున్న మినీ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

మినీ మహానాడును జయప్రదం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న ప్రగడ నాగేశ్వరరావు

ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు


అచ్యుతాపురం రూరల్‌, మే 23: అచ్యుతాపురంలో మంగళవారం జరగనున్న మినీ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి  ప్రగడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ నేతలతో సోమవారం ఆయన మాట్లాడుతూ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులు హాజరవుతారని చెప్పారు. అచ్యుతాపురం మండలం కోనేపాలెం లేపాక్షి ఏసీ కల్యాణ మండపంలో ఉదయం పది గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని కోరారు. అనంతరం తిమ్మరాజుపేటలోని అభయాంజనేయస్వామిని ప్రగడ దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న కోలాటాల పోటీలను తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ శరగడం భాగ్యలక్ష్మి, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కర్రి ఆదిబాబు, శరగడం శివబాపునాయుడు, కర్రి వెంకటరమణ, రవి కుమార్‌, యల్లపు గోవింద, ఆడారి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. 


Read more