ఆదివాసీ అర్చకులు హిందూ ధర్మం గొప్పతనం బోధించాలి

ABN , First Publish Date - 2022-03-05T06:15:57+05:30 IST

ఆదివాసీ అర్చకులు హిందూ ధర్మం గొప్పతనం బోధించాలని సద్గురు సేవాశ్రమం స్వామి అన్నారు.

ఆదివాసీ అర్చకులు హిందూ ధర్మం గొప్పతనం బోధించాలి
అర్చకులకు పూజా సామగ్రిని అందజేస్తున్న స్వామి


చింతపల్లి, మార్చి 4: ఆదివాసీ అర్చకులు హిందూ ధర్మం గొప్పతనం బోధించాలని సద్గురు సేవాశ్రమం స్వామి అన్నారు. శుక్రవారం తాజంగి బీటాలైన్‌ రాధ కృష్ణ మందిరంలో జి.మాడుగుల, కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాలకు చెందిన 250 మంది ఆదివాసీ అర్చకులకు పూజా సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఆలయంలో అన్నసమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్‌, విశ్వహిందూ పరిషత్‌ వనవాసి కల్యాణ్‌ ఆశ్రమం ప్రతినిధులు పాల్గొన్నారు.  

Read more