ముగిసిన పౌరరక్షణ వలంటీర్ల శిక్షణ

ABN , First Publish Date - 2022-12-07T01:22:54+05:30 IST

ప్రకృతి విపత్‌కరమైన ప్రమాదాలు సంభవించినపుడు సహాయక చర్యలు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జీవీఎంసీ కమీషనర్‌ పి.రాజాబాబు పేర్కొన్నారు.

ముగిసిన పౌరరక్షణ వలంటీర్ల శిక్షణ
పౌర రక్షణ వలంటీర్ల శిక్షణ ప్రదర్శనను పరిశీలిస్తున్న జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు

సీతంపేట, డిసెంబరు 6: ప్రకృతి విపత్‌కరమైన ప్రమాదాలు సంభవించినపుడు సహాయక చర్యలు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జీవీఎంసీ కమీషనర్‌ పి.రాజాబాబు పేర్కొన్నారు. గురుద్వార కూడలి శాంతిపురంలో గల పౌర రక్షణ సంస్థ ఆధ్వర్యంలో 226వ బ్యాచ్‌ శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన జీవీఎంసీ కమిషనర్‌ మాట్లాడుతూ వలంటీర్లను అభినందించారు. ఈ సందర్భంగా వలంటీర్లు తాము శిక్షణ పొందిన అంశాలను ప్రదర్శించారు. ప్రకృతి విపత్కర సమయంలో ఎలా మెలగాలి, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పై అంతస్తు నుంచి క్షతగాత్రులను ఏవిధంగా సురక్షితంగా కిందికి తీసుకురావాలి, క్షతగ్రతులకు ప్రథమ చికిత్స తదితర అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉప పౌర రక్షణ అధికారి కె.భవాని, ప్రత్యేక ఉప కలెక్టర్‌ విజయలక్ష్మి, శిక్షకులు శ్రీనివాస రాజమణి, డాక్టర్‌ పి.రామారావు, వైద్య, ఆగ్నిమాపక, పోలీసు కమ్యూనికేషన్‌ శాఖ, సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:22:56+05:30 IST