నౌకాదళ అధికారులకు నాయకత్వ లక్షణాలపై గీతంలో శిక్షణ

ABN , First Publish Date - 2022-09-27T06:17:44+05:30 IST

భారత నౌకాదళం అధికారులకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆధ్వర్యంలో నాయకత్వ లక్షణాలపై అయిదు రోజులు మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ (ఎమ్‌డీపీ) సోమవారం ప్రారంభమయ్యింది.

నౌకాదళ అధికారులకు  నాయకత్వ లక్షణాలపై గీతంలో శిక్షణ
మాట్లాడుతున్న గీతం బిజినెస్‌ స్కూల్‌ డీన్‌ అమిత్‌భద్రా

స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆధ్వర్యంలో నిర్వహణ

విశాఖపట్నం, సెప్టెంబరు 26: భారత నౌకాదళం అధికారులకు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆధ్వర్యంలో నాయకత్వ లక్షణాలపై అయిదు రోజులు మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ (ఎమ్‌డీపీ) సోమవారం ప్రారంభమయ్యింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నౌకాదళ అధికార్లు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ అమిత్‌భద్రా మాట్లాడుతూ క్రమశిక్షణ, నాయకత్వ పటిమకు భారత నౌకాదళం పెట్టింది పేరని చెప్పారు.


అందువల్ల పాలనాపరంగా గమనించాల్సిన అంశాలపై వారికి గీతం నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ఎమ్‌.ఎస్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ద్వారా కార్పొరేట్‌ రంగంలోని వారికి వివిధ పరిశ్రమల నిపుణులకు వందకు పైగా మేనేజ్‌మెంట్‌ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.


భారత నౌకాదళంలోని వివిధ విభాగాలలో అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌లుగా విధులు నిర్వహిస్తున్న వారి అవసరాలకు తగిన విధంగా ఎండీపీ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సీనియర్‌ ప్రొఫెసర్లు కె.అశోక్‌, ప్రసాద్‌, డాక్టర్‌ బి.కృష్ణకుమారి, రిసోర్స్‌ పర్సన్‌లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

Read more