లంబసింగికి పర్యాటకుల తాకిడి

ABN , First Publish Date - 2022-10-17T06:05:30+05:30 IST

మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి హిల్స్‌ సందర్శకులు ఆదివారం నిరాశకు గురయ్యారు.

లంబసింగికి పర్యాటకుల తాకిడి
చెరువులవేనం వద్ద పర్యాటకుల సందడి

చింతపల్లి, అక్టోబరు 16: సీజన్‌ ప్రారంభానికి ముందే లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం లంబసింగి ప్రకృతి అందాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి లంబసింగి, చెరువులవేనం, తాజంగి రిజర్వాయర్‌ వద్ద పర్యాటకుల సందడి మొదలైంది. పదకొండు గంటల వరకు లంబసింగి పరిసర ప్రాంతాల్లో రద్దీ కనిపించింది. సాఽధారణంగా నవంబరు మొదటి వారం నుంచి లంబసింగి సందర్శించే పర్యాటకుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ ఏడాది అక్టోబరు మొదటి పక్షం నుంచే పర్యాటకుల తాకిడి పెరిగింది. శని, ఆదివారాల్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

 

సందర్శకుల నిరాశ 

పాడేరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి హిల్స్‌ సందర్శకులు ఆదివారం నిరాశకు గురయ్యారు.   కొన్ని రోజులుగా వంజంగి హిల్స్‌లో మేఘాల అందాలు సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకునేవి. అయితే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం తదితర వాతావరణ మార్పుల కారణంగా ఆదివారం ఉదయం మంచు మేఘాల దర్శనం లేకుండా పోయింది. దీంతో వంజంగి హిల్స్‌ సందర్శించిన వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. 


Updated Date - 2022-10-17T06:05:30+05:30 IST