నల్లగొండ పరిసరాల్లో పులి!

ABN , First Publish Date - 2022-07-06T06:11:42+05:30 IST

మండలంలోని కొప్పుకొండ నల్లగొండ గ్రామ అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగాడుతున్నట్టు గ్రామస్థులు తెలిపారు.

నల్లగొండ పరిసరాల్లో పులి!
కొత్తపల్లి కొండ దిగువ నల్లగొండ సమీపంలో పులి పాదముద్రలు

గాండ్రింపులు వినిపించాయంటున్న గ్రామస్థులు


కొయ్యూరు, జూలై 5: మండలంలోని కొప్పుకొండ నల్లగొండ గ్రామ అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగాడుతున్నట్టు గ్రామస్థులు తెలిపారు. సోమవారం రాత్రి పాత నల్లగొండ గ్రామ సమీప కొత్తపల్లి కొండకు ఆనుకుని ఉన్న పల్లి చిన్నబ్బాయి చేనుపాకలు సమీపంలో పెద్దపులి గాండ్రింపులు వినిపించాయని చెబుతున్నారు. మంగళవారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా పులి పాదముద్రలు కనిపించాయి. నల్లగొండ నుంచి చింతాలమ్మ ఘాట్‌ పరిసరాలలో పులి సంచరిస్తున్నట్టు గ్రామస్థులు భావిస్తున్నారు. దీంతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా అటవీ అధికారులు సాయంత్రం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ పాదముద్రలు పులివి కాకపోవచ్చని తెలిపారు.

Updated Date - 2022-07-06T06:11:42+05:30 IST