కొవిడ్‌తో ప్రాణాలు పోయే పరిస్థితి లేదు
ABN , First Publish Date - 2022-12-15T03:31:35+05:30 IST
కొవిడ్ మహమ్మారిని తట్టుకునేలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని, ఈ దశలో మరో వేవ్ వచ్చినా ప్రాణాలు పోయే పరిస్థితులు లేవని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్‌ఎ్‌సఏ) అధ్యక్షరాలు ఆచార్య చంద్రిమ షాహా అన్నారు.
నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు లేకపోలేదు
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అధ్యక్షురాలు చంద్రిమ షాహా
విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ మహమ్మారిని తట్టుకునేలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని, ఈ దశలో మరో వేవ్ వచ్చినా ప్రాణాలు పోయే పరిస్థితులు లేవని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్‌ఎ్‌సఏ) అధ్యక్షరాలు ఆచార్య చంద్రిమ షాహా అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో బుధవారం జరిగిన ఐఎన్‌ఎ్‌సఏ 88వ వార్షికోత్సవ సభలో ఆమె అధ్యక్షోపన్యాసం చేశారు. ప్రస్తుతం చైనాలో రోజూ వేలల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నా ఎవరూ మృత్యువాతపడడం లేదనే విషయాన్ని చంద్రిమ గుర్తుచేశారు. దీని ప్రభావంతో భారత్‌తోపాటు ఇతర దేశాల్లోనూ నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్‌ను తట్టుకునేలా వ్యాక్సిన్లు వచ్చాయని, అలాగే హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగిందని చెప్పారు. భవిష్యత్తులో వ్యాక్సిన్లకు సంబంధించి మరింత మెరుగైన సాంకేతికత అందుబాటులోకి వస్తుందన్నారు. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్‌లో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందించడం చాలా క్లిష్టమైన అంశమైనప్పటికీ.. అందరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. మానవ సమాజంలో మహమ్మారుల విజృంభణ జరిగిన ప్రతిసారీ, వాటిని తట్టుకునేలా కొత్త ఆవిష్కరణలు వచ్చాయన్నారు. గత 40 ఏళ్లలో వ్యాప్తిచెందిన వైర్‌సలను పరిశీలిస్తే 1980లలో ఎయిడ్స్, రెండేళ్ల క్రితం కొవిడ్ ప్రపంచాన్ని వణికించాయన్నారు. వైర్‌సలు విజృంభించిన ప్రతిసారీ దేశాలు పరస్పర అంగీకారంతో వేరియంట్ల వివరాలతోపాటు వాటిని తట్టుకునే ఆవిష్కరణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కొవిడ్-19కు చైనాయే కారణమా..? అన్న ప్రశ్నకు దాని మూలాలు ఇంకా తెలియాల్సి ఉందని చంద్రిమ బదులిచ్చారు. సభకు జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ (ఎన్‌ఐవో) డైరెక్టర్ డాక్టర్ సునీల్ కె.సింగ్ స్వాగతం పలుకగా, అకాడమీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీవీ కక్కర్ కార్యక్రమాల వివరాలను నివేదించారు. ఎన్‌ఐవో విశాఖ ప్రాంతీయ కేంద్రం ఇన్‌చార్జి డాక్టర్ జీపీఎస్ మూర్తి వందన సమర్పణ చేశారు. ఈ సభకు దేశం నలుమూలల నుంచి పలు పరిశోధన సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.