Visakha : నా బాయ్ ఫ్రెండ్‌కి చెప్పి లేపించేస్తానంటూ ఏఎస్ఐకి యువతి బెదిరింపు

ABN , First Publish Date - 2022-12-15T10:00:53+05:30 IST

అర్ధరాత్రి ఆర్కే బీచ్‌లో ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. ఆర్కే బీచ్ వైఎంసీఏ వైపునకు నైట్ రౌండ్స్‌కి వెళ్లిన పోలీసులకు అమూల్య అనే యువతి మద్యం సేవిస్తూ కంటపడింది.

Visakha : నా బాయ్ ఫ్రెండ్‌కి చెప్పి లేపించేస్తానంటూ ఏఎస్ఐకి యువతి బెదిరింపు

Visakha : అర్ధరాత్రి ఆర్కే బీచ్‌లో ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. ఆర్కే బీచ్ వైఎంసీఏ వైపునకు నైట్ రౌండ్స్‌కి వెళ్లిన పోలీసులకు అమూల్య అనే యువతి మద్యం సేవిస్తూ కంటపడింది. వెంటనే ఆమె వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతే ఆ యువతి రెచ్చిపోయింది. త్రీ టౌన్ ఏఎస్ఐ సత్యనారాయణపై తిరగబడింది. ఆయనను దుర్భాషలాడటమే కాకుండా కాలితో తన్నింది. తన బాయ్ ఫ్రెండ్‌కి చెప్పి లేపించేస్తానంటూ రెచ్చిపోయింది. అసలు రేపటి నుంచి పోలీసులెవ్వరినీ రోడ్డు మీదే తిరగకుండా చేస్తానంటూ సవాళ్లు విసిరింది. ఏఎస్‌ఐ యూనిఫాం స్టార్స్‌ను లాగేసి ఆయన షర్ట్‌ను చింపేసింది. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్న వ్యక్తిపై సైతం బాటిల్‌తో దాడికి దిగింది. అమూల్యకి బ్రీత్ అనలైజర్‌తో చెక్ చేయగా ఆల్కహాల్ కంటెంట్ 148.1mg గా నమోదైంది. అమూల్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-12-15T10:00:55+05:30 IST