‘వారాహి’ని చూసి వైసీపీ నేతల్లో వణుకు
ABN , First Publish Date - 2022-12-15T00:31:19+05:30 IST
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి వాహనాన్ని చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని పార్టీ ఉత్తర నియోజ కవర్గం ఇన్చార్జి పసుపులేటి ఉషాకిరణ్ అన్నారు.
సిరిపురం, డిసెంబరు 14: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి వాహనాన్ని చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని పార్టీ ఉత్తర నియోజ కవర్గం ఇన్చార్జి పసుపులేటి ఉషాకిరణ్ అన్నారు. పవన్‌పై వైసీపీ నేతల వ్యాఖ్యల కు నిరసనగా బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వారాహి యాత్ర ద్వారా పవన్‌కల్యాణ్ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నారని, దీనిని చూసి మంత్రి రోజా తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ఊసరవెల్లిగా గంటకో పార్టీని మార్చే రోజా పవన్‌పై వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. ఆమె పర్యాటకరంగ అభివృద్ధికి, యువత ఉపాధికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీర మహిళలు కిరణ్ హర్షవల్లి, ప్రియాంక, యజ్ఞశ్రీ, శాలిని, సురేఖ, ఆడబాల లక్ష్మి, తెలుగు లక్ష్మి, కళా, తదితరులు పాల్గొన్నారు.