పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల నూతన కమిటీ ఏకగ్రీవం

ABN , First Publish Date - 2022-12-16T01:02:55+05:30 IST

పాడేరు యూనిట్‌ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పీఆర్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల నూతన కమిటీ ఏకగ్రీవం
ప్రమాణం చేస్తున్న పీఆర్‌ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం

అధ్యక్షుడిగా సన్యాసిరావు, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక

పాడేరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పాడేరు యూనిట్‌ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా ఎం.సన్యాసిరావు, కార్యదర్శిగా జీడీఎస్‌ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా పి.గౌరిశంకర్‌, సంయుక్తకార్యదర్శిగా కె.కృష్ణారావు, కోశాధికారిగా ఎల్‌.నీలిమ, జిల్లా కౌన్సిల్‌ సభ్యులుగా జి.పార్వతి, కె.ధనలక్ష్మిలను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా శ్రీనివాసరావు వ్యవహరించగా, ఎన్నికల పరిశీలకులుగా ఎల్‌.పూర్ణయ్య, ఆర్‌వీ నాగరాజు, నాగేశ్వరావు వ్యవహరించారు. పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల మండలాలకు చెందిన పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. సంఘం నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎన్నికైన నూతన కమిటీ నేతలు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

Updated Date - 2022-12-16T01:02:58+05:30 IST