రిలయన్స్‌కు అనుమతిపై నాయీ బ్రాహ్మణ సంఘం ఆగ్రహం

ABN , First Publish Date - 2022-11-16T02:55:45+05:30 IST

నాయీ బ్రాహ్మణుల క్షౌరవృత్తిలోకి రిలయన్స్‌ వంటి బడా కంపెనీలు రావడం అన్యాయమని నాయీ బ్రాహ్మణ సంఘం ఆగ్రహించింది.

రిలయన్స్‌కు అనుమతిపై నాయీ బ్రాహ్మణ సంఘం ఆగ్రహం

విజయవాడ, నవంబరు 15: నాయీ బ్రాహ్మణుల క్షౌరవృత్తిలోకి రిలయన్స్‌ వంటి బడా కంపెనీలు రావడం అన్యాయమని నాయీ బ్రాహ్మణ సంఘం ఆగ్రహించింది. ‘రిలయన్స్‌ సెలూన్స్‌’ పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ సంస్థకు రెండేళ్ల కిందటే వైసీపీ ప్రభుత్వం అనుమతించిందని ఆ సంఘం ప్రతినిధి గుంటుపల్లి నాగేశ్వరరావు మండిపడ్డారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2022-11-16T02:55:45+05:30 IST