మోసకారి ప్రభుత్వానికి నూకలు చెల్లాయి

ABN , First Publish Date - 2022-12-16T23:43:22+05:30 IST

అన్ని వర్గాలను మోసగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని తెలుగుదేశం పార్టీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చ్ఛార్జీ గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు.

మోసకారి ప్రభుత్వానికి నూకలు చెల్లాయి
నల్లగొండ పంచాయతీలో గిరిజనులతో మాట్లాడుతున్న ఈశ్వరి, నాయకులు

పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి

కొయ్యూరు, డిసెంబరు 16: అన్ని వర్గాలను మోసగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని తెలుగుదేశం పార్టీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చ్ఛార్జీ గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. మండలంలోని రావణాపల్లి, నల్లగొండ, అంతాడ, బంగారమ్మపేట పంచాయతీల్లో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఆయా పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఈశ్వరి మాట్లాడుతూ అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టేలా జగన్మోహనరెడ్డి హామీలు ఇచ్చారన్నారు. మద్యపాన నిషేధం, 45 సంవత్సరాలకే పింఛను తదితర హామీలను గాలికొదిలి ప్రజలను మోసగించారన్నారు. సామాన్యుడు జీవించే అవకాశం లేకుండా నిత్యావసర సరకులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నూనే ధరలు పెంచుకుంటూ పోతున్నారన్నారు. ఈ మోసకార ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్మింప తలపెట్టిన హైడ్రోపవర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా శనివారం నిర్వహింప తలపెట్టిన మన్యం మంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఉల్లి వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కొర్రు రామ్మూర్తి, రాజేంద్రపాలెం సర్పంచ్‌ పీటా సింహాచలం, కార్యదర్శి లేగుల పుష్పలత, నాయకులు బోనంగి సత్యవతి, శ్యామల వరలక్ష్మి, బఖీర్‌ఖాన్‌, వై.వరహాలబాబు, సుమర్ల సాంబశివరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:43:28+05:30 IST