ఉక్కు ఉద్యమానికి సీఎం నాయకత్వం వహించాలి
ABN , First Publish Date - 2022-01-13T05:59:55+05:30 IST
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం వహించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు డిమాండ్ చేశారు.
పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు
కూర్మన్నపాలెం, జనవరి 12: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాయకత్వం వహించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ గంధం వెంకటరావు డిమాండ్ చేశారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 335వ రోజు కొనసాగాయి. బుధవారం ఈ దీక్షలలో ఎంఎంఎస్‌ఎం, డబ్ల్యూఆర్‌ఎం-2, ఎస్‌టీఎం, ఎస్‌బీఎం ఉద్యోగులు కేఆర్‌కే రాజు, ఆర్.సూరిబాబు, సుబ్బారావు, దేముడు, జి.ఆనంద్, కె.శ్రీనివాస్, వి.కృష్ణంనాయుడు కూర్చున్నారు. ఈ శిబిరంలో వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి బాఽధ్యత తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్లాంట్ పరిరక్షణకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధమన్నారు.