శ్రీకాంత్‌పై కేసులు ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-23T06:13:22+05:30 IST

కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డిని ఆత్మకూరులో మతం ముసుగులో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం తగదని బీజేపీ గాజువాక కో-ఆర్డినేటర్‌ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో శనివారం నిరసన సభ నిర్వహించారు.

శ్రీకాంత్‌పై కేసులు ఉపసంహరించుకోవాలి
నిరసనలో పాల్గొన్న బీజేపీ నాయకులు పరశురామరాజు, కరణంరెడ్డి నరసింగరావు

బీజేపీ నాయకుల డిమాండ్‌

గాజువాక, జనవరి 22: కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డిని ఆత్మకూరులో మతం ముసుగులో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం తగదని బీజేపీ గాజువాక కో-ఆర్డినేటర్‌ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో శనివారం నిరసన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలన్నారు. శ్రీకాంత్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. అరకు పార్లమెంట్‌ బీజేపీ ఇన్‌చార్జి పరశురామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దీనంకొండ కృష్ణంరాజు, బాటా శ్రీను, గూటూరు శంకరరావు, కిలాడి ముసలయ్య, అప్పలరాజు, నాగేశ్వరరావు, సత్తిబాబు, రామస్వామి పాల్గొన్నారు. 


Read more