చవితి పూజలకు ఆలయాలు సిద్ధం

ABN , First Publish Date - 2022-08-31T06:07:10+05:30 IST

నగరంలోని పలు ఆలయాలు వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధం చేశారు. సీతంపేట దుర్గాగణపతి ఆలయానికి రంగులు వేసి విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు.

చవితి పూజలకు ఆలయాలు సిద్ధం
విద్యుత్‌ అలంకరణతో సీతంపేట దుర్గాగణపతి ఆలయం

సీతంపేట, ఆగస్టు 30: నగరంలోని పలు ఆలయాలు వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధం చేశారు. సీతంపేట దుర్గాగణపతి ఆలయానికి రంగులు వేసి విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు. బుధవారం దుర్గాగణపతి నిజరూప దర్శనం, మరుసటి రోజు నుంచి ప్రతి రోజు సాయంత్రం వెండి తొడుగుతో గణపతి, లక్ష్మీ గణపతి, విష్ణు గణపతి, ఆదిత్య గణపతి, త్రిముఖ గణపతి, స్కంద గణపతి, బాల గణపతి, అర్థనారీశ్వర గణపతి, సిద్ది,బుద్ది సమేత గణపతి అలంకరణలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్టు ఈఓ జగ్గనాఽ్నఽథరావు, ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సారిపిల్లి గోవింద్‌ పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమాలలో పరిసర గ్రామాల ప్రజలు పాల్గొనాలని కోరారు. సీతమ్మధార రైతుబజార్‌ బయట, ఫిషింగ్‌ హకర్స్‌ జోన్‌ వద్ద మట్టి వినాయక ప్రతిమల అమ్మకాలు జోరుగా సాగాయి.  పలువురు చిరువ్యాపారులు రహదారిపై స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-31T06:07:10+05:30 IST